అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2027 Trades | టాటా ఐపీఎల్ 2027కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) నలుగురు ఆటగాళ్లను మార్చుకున్నాయి. ఇందులో భాగంగా SRH జట్టులోని లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ CSKలో చేరారు. CSK టీంలోని ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ SRHలోకి వచ్చారు.
IPL 2027 Trades | రూ. 6 కోట్ల సీఎస్కేలోకి లివింగ్ స్టోన్
ఇంగ్లాండ్ ఆల్-రౌండర్ అయిన లివింగ్‌స్టోన్‌ను మొదట SRH రూ. 13 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతను రూ. 6 కోట్లకు CSKలో చేరాడు. ఆస్ట్రేలియా సీమ్-బౌలింగ్ ఆల్-రౌండర్ ఎడ్వర్డ్స్ కూడా తన ప్రస్తుత ధర అయిన రూ. 3 కోట్లకు CSKలోకి వెళ్లాడు. ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి ముందే ఎడ్వర్డ్స్‌ను SRH తీసుకుంది. కానీ పాదానికి గాయం కావడంతో అతను ఐపీఎల్ 2026లో ఆడలేకపోయాడు.
IPL 2027 Trades | సీఎస్కే నుంచి బౌలర్ ఖలీల్..
సీఎస్కే నుంచి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఖలీల్‌ను SRH అతని ప్రస్తుత ధర అయిన రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. గతంలో 2018 నుంచి 2021 వరకు SRHకు ప్రాతినిధ్యం వహించిన ఖలీల్, IPL 2025లో CSK తరఫున 14 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీలోకి తిరిగి వస్తున్నాడు. అతను IPL 2026లో CSK తరఫున ఐదు మ్యాచ్‌లలో ఆడి, కుడి క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా ఆ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
IPL 2027 Trades | ఫాస్ట్ బౌలర్ ఎల్లిస్ కూడా..
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఎల్లిస్ కూడా తన ప్రస్తుత 2 కోట్ల రూపాయల ఫీజుతో SRHలో చేరాడు. డెత్ ఓవర్లలో మంచి రికార్డు ఈ ప్లేయర్‌కు ఉంది. దీంతో ఎస్ఆర్హెచ్ అతడిని జట్టులోకి తీసుకుంది.
ఇది కూడా చదవండి..: Manisha Bhanwala gold medal | భారత మహిళా కుస్తీలో సరికొత్త చరిత్ర.. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మనీషా భాన్వాలాకు స్వర్ణం!