drunk driving tests | మందుబాబులకు షాక్​.. మధ్యాహ్నం డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : drunk driving tests | మందుబాబులకు హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) షాక్​ ఇస్తున్నారు. మధ్యాహ్నం వేళలో సైతం డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపడుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా వరకు ప్రమాదాలకు మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం కారణం అవుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్​ జాయింట్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సంతోష్ నగర్ (Santosh Nagar) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎస్ సదన్ జంక్షన్, డిఎంఆర్ఎల్ (DMRL) జంక్షన్ల వద్ద పగటిపూట ఆకస్మిక డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ తెలిపారు.

drunk driving tests | నిరంతర తనిఖీలు

ఈ తనిఖీల్లో ప్రధానంగా వాటర్ ట్యాంకర్లు, అంబులెన్స్ డ్రైవర్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేవలం రాత్రి సమయాల్లోనే కాకుండా, నగరంలోని ప్రధాన కూడళ్లలో పగటిపూట కూడా డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలను ముమ్మరం చేశారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిని కోర్టు ఎదుట హాజరు పరుస్తున్నారు. నేరం నిరూపితమైన పక్షంలో న్యాయస్థానం నిందితులకు 2 రోజుల నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘించిన 27 మందిని కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపినట్లు ఇన్​స్పెక్టర్​ మహ్మద్​ ఆసిఫ్​ తెలిపారు.

ఇది కూడా చదవండి : High Court Notices | పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.. సీవీ ఆనంద్‌కు ధిక్కార నోటీసులు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *