Invesco NayaRiwaaz Campaign | దీపావళి వేళ ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ కొత్త ప్రచారం.. ఆనవాయితీని ‘పెట్టుబడి’గా మార్చే #NayaRiwaaz!

ఈ దీపావళి పండుగ సందర్భంగా 'ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్' (Invesco Mutual Fund) #NayaRiwaaz అనే పేరుతో ఒక ప్రత్యేకమైన డిజిటల్ క్యాంపెయిన్ ఫిల్మ్‌ను విడుదల చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Invesco NayaRiwaaz Campaign | ఈ దీపావళి ( Diwali )పండుగ సందర్భంగా ‘ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్’ (Invesco Mutual Fund) #NayaRiwaaz అనే పేరుతో ఒక ప్రత్యేకమైన డిజిటల్ క్యాంపెయిన్ ఫిల్మ్‌ను విడుదల చేసింది. సాంప్రదాయకంగా ఇచ్చే బహుమతుల ఆచారాన్ని మారుస్తూ, పిల్లల కలలు, ఆర్థిక క్రమశిక్షణ , భవిష్యత్తు కోసం చేసే సమిష్టి ఆదా ఆధారంగా ఈ హృద్యమైన కథనాన్ని రూపొందించారు. చిన్నపాటి పొదుపు అలవాటు కాలక్రమేణా పెద్ద ఆశయాలకు ఎలా పునాది వేస్తుందో ఈ చిత్రం ద్వారా చాటిచెప్పారు.

Invesco NayaRiwaaz Campaign | బ్లూ లిఫాఫా ఆధారంగా ..

ఈ షార్ట్ ఫిల్మ్ ‘ఆర్యన్’ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రతి దీపావళికి స్వీట్లు తినడానికి ముందే ఆర్యన్‌కు తన తండ్రి ఒక ‘బ్లూ కలర్ లిఫాఫా’ (కవర్)ను కానుకగా ఇస్తుంటాడు. చిన్నతనంలో ఒక సాధారణ అలవాటుగా ప్రారంభమైన ఈ ఆచారం, ఆర్యన్ పెద్దయ్యాక తన కలలను నెరవేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏళ్ల తర్వాత, ఆర్యన్ కూడా తన తండ్రి నేర్పిన అదే సంప్రదాయాన్ని తన కుమార్తెకు కొనసాగిస్తూ ఆ ‘బ్లూ లిఫాఫా’ను అందజేస్తాడు.

Invesco NayaRiwaaz Campaign | ఇన్వెస్కో మార్కెటింగ్ హెడ్ స్పందన..

ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ మార్కెటింగ్ హెడ్ అమేయా ఇంగాలే మాట్లాడుతూ.. “దీపావళి అంటే కుటుంబ అనుబంధాలు, కొత్త ప్రారంభాలకు చిహ్నం. ప్రేమతో చేసే ఒక చిన్న అలవాటు కాలక్రమేణా ఎలా గొప్పగా మారుతుందో చూపించాలనుకున్నాం. బహుమతులు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాయి, కానీ మనం అందించే మంచి అలవాట్లు తరతరాలుగా నిలిచిపోతాయి. పెట్టుబడులను కూడా కుటుంబ ఆచారంలో ఒక భాగంగా మార్చవచ్చని #NayaRiwaaz ద్వారా పంచుకున్నాం” అని పేర్కొన్నారు.

Invesco NayaRiwaaz Campaign | ఆర్థిక లక్ష్యాల సాధనే ధ్యేయం..

‘అనలాగ్ స్టూడియో’ (Analogue Studio) సహకారంతో రూపుదిద్దుకున్న ఈ క్యాంపెయిన్ ద్వారా.. భారతీయ కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు , ఆర్థిక ప్రణాళికలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఒక భాగంగా మార్చుకోవాలని ఇన్వెస్కో ప్రోత్సహిస్తోంది. త్వరగా పెట్టుబడులు ప్రారంభించడం, క్రమశిక్షణతో సుదీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సులువుగా సాధించవచ్చని ఈ చిత్రం ద్వారా సందేశమిచ్చారు.

ఇది కూడా చదవండి: Eagle Force | ఒడిశా నుంచి గంజాయి.. 400 కిలోలు అమ్మిన ముఠా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *