అక్షరటుడే, వెబ్‌డెస్క్: Metro Common Pass | హైదరాబాద్ నగరవాసులకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరలను భారీగా తగ్గించింది. కొత్త రేట్లు నవంబర్ 8నుంచి అమలులోకి రానున్నాయి.
హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల కోసం ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రోజు వారి, నెలవారీ పాస్‌లను ప్రవేశ పెట్టింది. ఈ పాస్‌లు తీసుకుంటే సిటీ బస్సులు, మెట్రోలో అపరిమితంగా ప్రయాణం చేయొచ్చు. అయితే ప్రారంభంతో మంత్లీ పాస్ ధరను రూ.8500గా నిర్ణయించారు. నిజానికి ఈ పాస్‌ను మధ్య తరగతి ఉద్యోగుల కోసం తీసుకొచ్చారు. అయితే వారి జీతంలో సగం వరకు పాస్ ధర ఉండటంతో విమర్శలు వచ్చాయి. దీంతో ధరలు తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
Metro Common Pass | సగం కంటే ఎక్కువ తగ్గిన ధర
సీఎం ఆదేశాల మేరకు అధికారులు మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరలను తగ్గించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మెట్రో నెల పాస్ ధర రూ.8,500 ఉండగా.. ప్రస్తుతతం రూ.4 వేలకు తగ్గించారు. సగానికి కంటే ఎక్కువగా ధర తగ్గడం గమనార్హం. ఈ పాస్‌పై నెలకు గరిష్టంగా 50 రాకపోకలు (round trips) చేసుకోవచ్చు. డెయిలీ పాస్ ధరను రూ.400 నుంచి రూ.275కు తగ్గించారు. రోజుకు గరిష్టంగా 4 ప్రయాణాలు (single journeys) చేయొచ్చు. కొత్త ధరలతో ప్రతిరోజూ ప్రయాణించే వారికి పెద్ద ఉపశమనం లభించనుంది. ఈ నిర్ణయం రోజువారీ ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి, ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి, చౌకగా మారుస్తుంది. కొత్త రేట్లు ఈ నెల 8 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: POCSO Case Medical Reports | లైంగిక దాడి, పోక్సో కేసుల విచారణ వేగవంతం: గాంధీ ఆసుపత్రి వైద్యులతో సిటీ సీపీ సజ్జనార్ సమావేశం