Husband Murder Case | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Husband Murder Case | జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally District)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఎడ్ల బండిపై తీసుకెళ్లి చికెన్​పల్లి అనే గ్రామ సమీపంలో పడేశారు.

భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన అజ్మీర చందు (30), పావని భార్య భర్తలు. అయితే పావనికి కొంతకాలంగా సంతోష్​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఎలాగైన తన భర్త అడ్డు తొలగించుకొని ప్రియుడితో ఉండాలని ఆమె నిర్ణయించుకంది. తన ప్రియుడు సంతోష్​తో కలిసి భర్త చందును ఇంట్లోనే హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని చికెన్‌పల్లి సమీపంలో రోడ్డు పక్కన పడేసి, ఇద్దరు పారిపోయారు.

Husband Murder Case | గాలిస్తున్న పోలీసులు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలిచారు. గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధంతోనే హత్య చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు మృతుడి భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్​ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Husband Murder Case | కుటుంబాలు చిన్నాభిన్నం

వివాహేతర సంబంధాలతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాత్కాలిక ఆనందాల కోసం కొందరు పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ప్రియుడి మోజులో భర్తను చంపుతున్నారు. మరికొందరు ప్రేయసి కట్టుకున్న భార్యను అంతం చేస్తున్నారు. అనంతరం పోలీసులకు చిక్కి జైలు పాలు అవుతున్నారు. వారి పిల్లలు మాత్రం అనాథలు మారుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ఫోన్​, పెరుగుతున్న సోషల్​ మీడియా వినియోగంతో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Indiramma Family Insurance | ప్రతి కుటుంబానికి బీమా.. మరి వాటి సంగంతేంటి?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *