Nizamabad Police | మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆమెకు కాబోయే భర్తపై దాడిచేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police | మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆమెకు కాబోయే భర్తపై దాడిచేసిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ మేరకు నగరంలోని (Nizamabad) ఐదో టౌన్​ ఎస్సై సునీల్​ వివరాలు వెల్లడించారు.

Nizamabad Police | న్యాల్​కల్​ రోడ్​లో..

నగరంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న స్మార్ట్ సిటీ వెంచర్‌లో ఒక మహిళ తన కాబోయే భర్తతో ఉన్న సమయంలో అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారు అప్పటికే మద్యం తాగి ఉన్నారు.  ఆమె చేయి, చున్నీని లాగి అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా కాబోయే భర్తపై దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ.4,000 నగదుతో పాటు స్కూటీని బలవంతంగా లాక్కొని వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐదో టౌన్​ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఎస్సై సునీల్​ దర్యాప్తు చేపట్టి నిందితులైన గోడనే గణేష్, ప్రమోద్, పరమేశ్వర్‌లలో ప్రధాన నిందితుడైన గోడనే గణేష్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: బీజేపీ నాయకులకు.. ప్రజల సమస్యలు పట్టవా..? 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *