Lakdikapul One Way | లక్డీకాపూల్‌లో వన్‌-వే అమలుకు కసరత్తు

లక్డీకాపూల్​లో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు కొత్తగా వన్‌-వే విధానం అమలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lakdikapul One Way | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో లక్డీకాపూల్​ నిత్యం రద్దీగా ఉంటుంది. దీని మీదుగానే ప్రధాన ప్రాంతాలకు రాకపోకలు సాగుతుంటాయి. దీంతో నిత్యం ట్రాఫిక్​లో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

లక్డీకాపూల్​లో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు కొత్తగా వన్‌-వే విధానం అమలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నగర కమిషనర్​ సజ్జనార్ (CP Sajjanar)​ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాధ్యాసాధ్యాలపై సిబ్బందితో చర్చించారు. ఆ ప్రాంతంలో బైక్​పై పర్యటించారు. వాహనాల రద్దీని పరిశీలించారు. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్​ సజావుగా సాగేందుకు పలు సూచనలు చేశారు.

Lakdikapul One Way | ఈ మార్గంలో..

ట్రాఫిక్​ పోలీసులు ప్రతిపాదించిన వన్​ వే ప్రకారం.. ఓల్డ్ కంట్రోల్ రూమ్ నుంచి రవీంద్రభారతి మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లే ప్రయాణికులను రవీంద్రభారతి నుంచి నేరుగా అనుమతించరు. వీరు హెచ్‌డీఎఫ్‌సీ, పాత సైఫాబాద్‌ పీఎస్‌, ఇక్బాల్‌ మినార్‌, సచివాలయం జంక్షన్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. నిరంకారీ జంక్షన్‌ నుంచి ఓల్డ్ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లాలనుకునే వాహనాలు నేరుగా హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్‌ వైపు వెళ్లకుండా.. పాత సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద మళ్లిస్తారు. వీరిని ఇక్బాల్‌ మినార్‌ మీదుగా కుడి మలుపు తీసుకుని రవీంద్రభారతి ద్వారా ఓల్డ్ కంట్రోల్ రూమ్​కు పంపిస్తారు. సచివాలయం జంక్షన్‌, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ నుంచి పాత సైఫాబాద్‌ పీఎస్‌ వైపు వెళ్లే వాహనాలు ఇక్బాల్‌ మినార్‌ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ వద్ద యూ-టర్న్‌ తీసుకోవాలి.

Lakdikapul One Way | త్వరలో సమావేశం

కొత్తగా ప్రదిపాదించిన వన్​ వే విధానంపై ​ పోలీసులు త్వరలోనే జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్‌ శాఖలతో ఏర్పాటు చేయనున్నారు. ఆయా శాఖల అధికారులతో చర్చించిన అనంతరం వన్​వే అమలు చేస్తామని సీపీ తెలిపారు. మొదట కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూస్తామన్నారు. విజయవంతం అయితే శాశ్వతంగా వన్​ వే అమలు చేస్తామని తెలిపారు.

దీనిని కూడా చదవండి : KBR Park Traffic Diversions | కేబీఆర్​ పార్కు మీదుగా వెళ్తున్నారా.. పోలీసుల కీలక సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *