అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Attacks on Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు చేసింది. ఇరాన్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టినట్లు అమెరికా సైన్యం తెలిపింది.
తక్కువ స్థాయిలో సమర్థవంతంగా దాడులు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. కొద్ది నిమిషాల్లోనే తాము అనుకున్న లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించి, ట్రంప్‌కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికన్లు ఓటు వేశారు. ఈ క్రమంలో మరోసారి అమెరికా దాడులు చేపట్టడం గమనార్హం.
US Attacks on Iran | డ్రోన్‌ను కూల్చేశాం
కాగా ఖేష్మ్ ద్వీపంపై రెండు క్షిపణి దాడులు జరిగినట్లు ఇరాన్ తెలిపింది. అమెరికా ప్రయోగించిన డ్రోన్‌ను కూల్చి వేశామని చెప్పింది. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను రియాద్, మక్కా ప్రాంతాల్లో అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు తెలిపాయి. తమ ప్రభుత్వం టెహ్రాన్ ప్రతినిధులతో మాట్లాడుతోందని ట్రంప్ అన్నారు. దాడులు కొనసాగుతుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి..: US Midterm Election Results | అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. క్లీన్ స్వీప్ చేసిన డెమోక్రాట్లు