అక్షరటుడే, వెబ్‌డెస్క్: Firecrackers Safety | దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. ఆదివారం పండుగ ఉండటంతో రెండు రోజులుగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. మరోవైపు టపాసుల మోతలతో వీధులు మార్మోగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా క్రాకర్స్ కాలుస్తున్నారు. అయితే పటాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
దీపావళి సందర్భంగా చిన్నారులు ఉత్సాహంగా టపాసులు కాలుస్తారు. అయితే జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రతి సంవత్సరం రాష్ట్రంలో వందలాది మంది గాయాల పాలు అవుతున్నారు. ముఖ్యంగా కళ్ల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సరోజిని దేవి ఐ హాస్పిటల్‌కు వందలాది మంది బాధితులు వస్తుండటమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో ఈ ఏడాది పండుగను ఆనందంగా జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Firecrackers Safety | పర్యవేక్షణ అవసరం
చిన్నారులు పటాసులు కాల్చే సమయంలో పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. వారికి పెద్ద పెద్ద క్రాకర్స్ ఇవ్వొద్దు. అలాగే టపాసులు కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించాలి. ఏదైనా టపాసు పేలకపోతే దానిని వదిలేయాలి. దగ్గరకు వెళ్లాక అది పేలితే గాయాలు అయ్యే అవకాశం ఉంది. రీల్స్, ఫొటోల కోసం ప్రమాదకరంగా టపాసులు కాల్చొద్దు. భారీ క్రాకర్స్‌ను పేల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..: Dundigal Crime News | కామాంధుడి రాక్షసత్వం..యువతి కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారం!