అక్షరటుడే, వెబ్డెస్క్: Priya Sundareshan Arizona | అమెరికా రాజకీయాల్లో భారత సంతతి మహిళ మరొక చారిత్రక ఘనతను సాధించారు. అరిజోనా రాష్ట్ర సెనేట్ ప్రెసిడెంట్గా భారత సంతతికి చెందిన ప్రియా సుందరేశన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
సుదీర్ఘమైన 60 ఏళ్ల నిరీక్షణ తర్వాత అరిజోనా Arizona రాష్ట్రంలో డెమొక్రాట్లు పూర్తిస్థాయి అధికారాన్ని కైవసం చేసుకోవడం, అందులోనూ ఓ భారత సంతతి మహిళ అత్యున్నత పదవికి ఎంపిక కావడం విశేషం.
Priya Sundareshan Arizona | సైన్స్, పర్యావరణానికే నా తొలి ప్రాధాన్యం
విశిష్టమైన విద్యా నేపథ్యం కలిగిన ప్రియా సుందరేశన్ ప్రముఖ ఎంఐటీ (MIT) గ్రాడ్యుయేట్ మరియు నిపుణులైన న్యాయవాది. గతంలో ఆమె పర్యావరణ పరిరక్షణ, పౌరుల ఓటింగ్ హక్కుల పునరుద్ధరణ కోసం చట్టపరంగా తీవ్రంగా కృషి చేశారు.
తన ఎన్నికపై స్పందిస్తూ.. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో పరిపాలనాపరమైన నిర్ణయాలన్నీ సైన్స్, శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన మాత్రమే ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
ఏళ్ల తరబడి సాగిన రిపబ్లికన్ల ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ డెమొక్రాట్లు సాధించిన ఈ చారిత్రక విజయంలో ప్రియా సుందరేశన్ కీలక పాత్ర పోషించడంతో ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..