అక్షరటుడే, వెబ్డెస్క్: Balipadyami Stock Market| బలిపాడ్యమి (బలిప్రతిపద) సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్కు సెలవు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఎలాంటి ట్రేడింగ్ జరగదు. షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలతో పాటు డెరివేటివ్స్, కరెన్సీ,కమోడిటీ మార్కెట్లు కూడా మూసి ఉంటాయి.
Balipadyami Stock Market | సెలవు ఎందుకంటే..
పురాణాల ప్రకారం బలి చక్రవర్తి ప్రజలను చూడటానికి తిరిగి భూమికి వచ్చే రోజు కార్తీక మాస పాడ్యమి. ఈ రోజును బలి ప్రతిపద అని, బలిపాడ్యమి అని పిలుస్తారు. ఈ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పలు రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. బలిపాడ్యమిన స్టాక్ మార్కెట్లకు కూడా సెలవు. ఈరోజు ఈక్విటీ మార్కెట్లో షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరగవు. డెరివేటివ్స్, కరెన్సీ, కమోడిటీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా ఉండవు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..