Loan App Harassment | లోన్​ యాప్​ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

లోన్​ యాప్​ వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Loan App Harassment | లోన్​ యాప్​ వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని పహాడీషరీఫ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కొండాపూర్​ బెటాలియన్​లో శ్రీను(31) అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కొన్ని నెలల క్రితం లోన్​ యాప్​లో రూ.40 వేల అప్పు తీసుకున్నారు. అయితే అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో అతడికి వేధింపులు మొదలయ్యాయి. నిత్యం ఫోన్లు చేస్తూ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అంతేగాకుండా శ్రీను న్యూడ్​ ఫొటోలను కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు పంపుతామని బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీను ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Loan App Harassment | దా‘రుణ’ యాప్​లు

లోన్​ యాప్​లు దారుణంగా మారాయి. వీటిలో అప్పులు తీసుకోవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు అత్యవసర సమాయాల్లో తీసుకుంటున్నారు. త్వరగా లోన్లు ఇస్తుండటంతో వీటిని ఆశ్రయిస్తున్నారు. అయితే యాప్​ నిర్వాహకులు భారీగా వడ్డీ వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా లోన్​ తీసుకునే సమయంలో ఫోన్​ యాక్సెస్​ పర్మిషన్​ తీసుకుంటున్నారు. దీంతో డబ్బులు చెల్లించకపోతే ఫోన్​లోని ఫొటోలను తీసుకొని మార్ఫింగ్​ చేస్తున్నారు. అనంతరం లోన్​ తీసుకున్న వారి ఫోన్​ నంబర్లకు వాటిని పంపిస్తున్నారు. ఇప్పటికే లోన్​ యాప్​ల వేధింపులతో అనేక మంది చనిపోయారు. అయినా అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఆర్​బీఐ స్పందించి లోన్​ యాప్​లను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Ranabali OTT Release Date | విజయ్ దేవరకొండ, రష్మికల ‘రణబాలి’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎప్పుడంటే?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *