అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ranabali OTT Release Date | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ విజువల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించిన ఈ పాన్-ఇండియా చిత్రం, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘రణబాలి’ డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకోగా, నవంబర్ 13 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
Ranabali OTT Release Date | చారిత్రక ఘట్టాల ఆధారంగా బిగ్ కాన్వాస్ ఫిల్మ్
1876-1878 మధ్యకాలంలో బ్రిటిష్ పాలనలోని కరువు రాక్షసత్వానికి బలైపోయిన దాదాపు 80 లక్షల మంది భారతీయుల జ్ఞాపకార్థం, ఆనాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించగా, టీ-సిరీస్ సమర్పించింది.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ “సింగనమల బొబ్బిలి రణబాలి” అనే పవర్‌ఫుల్ వీరుడి పాత్రలో నటించగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్న “జయమ్మ” పాత్రలో ఒదిగిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీతో వచ్చిన ‘ఎంతయ్యా సామి’ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.
అలాగే ‘ద మమ్మీ’ ఫేమ్ హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో సర్ థియోడర్ హెక్టర్ అనే బ్రిటిష్ అధికారి పాత్రలో పవర్‌ఫుల్ విలన్‌గా నటించడం విశేషం. థియేటర్లలో చూడలేకపోయిన సినీ ప్రియులు ఈ నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆస్వాదించవచ్చు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..