అక్షరటుడే, వెబ్డెస్క్ : Sonia Gandhi PM Decision | దేశంలో 2004లో అధికార ఎన్డీఏ కూటమి ఓటమిపాలైంది. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఆ సమయంలో సోనియాగాంధీ ప్రధాని కావాలనుకున్నారు. అనంతరం ఆమె వెనక్కి తగ్గి మన్మోహన్ సింగ్ను ప్రధానిని చేశారు. ఆ సమయంలో ఏం జరిగిందో తాజాగా సోనియా గాంధీ తన ఆత్మకథలో వివరించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) మంగళవారం విడుదల అయింది. ఈ పుస్తకంలో ఆమె తన జీవితంలోని కీలక అంశాలను పంచుకున్నారు. ప్రధాని వివాదంపై స్పందిస్తూ.. 2004 లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందే, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధానమంత్రిని కాబోనని సోనియా గాంధీ తన పిల్లలతో చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం సాధించిన తర్వాత.. మిత్రపక్షాల ఒత్తిడితో ప్రధాని బాధ్యతలు చేపట్టాలనుకున్నారు. అనంతరం ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అభ్యంతరం తెలపడం, తాను సైతం ఆలోచించుకొని ఆ పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నారు.
Sonia Gandhi PM Decision | పిల్లలు ఒప్పుకోలేదు
సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలని రాహుల్ (Rahul Gandhi), ప్రియాంక కోరుకోలేదని ఆమె బుక్లో రాశారు. 1984లో ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో ఈ పదవికి, ప్రాణాపాయానికి మధ్య ఉన్న సంబంధాన్ని వారు బలంగా భావించారు. దీంతోనే సోనియా గాంధీ ప్రధాని కావడానికి రాహుల్ అభ్యంతరం చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. కూటమి నాయకులు ప్రధానమంత్రి పదవిని స్వీకరించమని ఆమెను కోరారు. అయితే సోనియా గాంధీ అది విని, తాను అలా చేయబోనని వారికి చెప్పారు. అయితే వారు ఒత్తిడి చేయడంతో తాను పదవి తీసుకోవడానికి ఓకే చెప్పానని గుర్తు చేసుకున్నారు.
Sonia Gandhi PM Decision | పిల్లలు వద్దనడంతో..
తాను పదవి తీసుకోవడానికి సమ్మతి తెలిపిన విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రశ్నించారని ఆమె బుక్లో రాశారు. ఆ ఒత్తిడికి లొంగవద్దని ప్రియాంక గాంధీ ఆమెను కోరారు. దీంతో ఆ రోజు రాత్రంతా ఆలోచించి తాను ప్రధాని పదవి తీసుకోకుడదని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అనంతరం మన్మోహన్ సింగ్ పేరును నామినేట్ చేశానన్నారు.
ఇది కూడా చదవండి..: Cancer Medicine Prices | క్యాన్సర్ రోగులకు బిగ్ రిలీఫ్.. 137 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు..