అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi Building Collapse | ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం ఐదు అంతస్తుల భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థలు మృతి చెందారు. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన అధికారులు ఐదుగురు అధికారులపై వేటు వేశారు.
ఢిల్లీ (Delhi)లో ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ భవనం కూలిపోయింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు శిథిలాల కింద చిక్కుకున్న పలువురు విద్యార్థులను రక్షించారు. అయితే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది.రాకేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ (సౌత్ జోన్), సూపరింటెండింగ్ ఇంజనీర్ రణ్వీర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బిల్డింగ్) లలిత్ కుమార్ గోయల్, అసిస్టెంట్ ఇంజనీర్ (బిల్డింగ్) సునీల్ చౌహాన్, జూనియర్ ఇంజనీర్ (బిల్డింగ్) ఆశిష్ కుమార్ (సౌత్ జోన్)పై వేటు వేసింది.
Delhi Building Collapse | ఆ భవనాన్ని కూల్చివేస్తాం
ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ మాట్లాడుతూ.. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారన్నారు. కూలిన భవనం ఉన్న మరో బిల్డింగ్ సైతం బలహీనపడిందని చెప్పారు. 1-2 రోజుల్లో దానిని కూల్చివేస్తామని తెలిపారు. ఆగస్టులో ఆ ప్రాంతంలో నాలుగు భవనాలకు కూల్చివేత ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. మూడు నెలల్లో 960 కూల్చివేతలు చేపట్టామని, 407 భవనాలకు సీజ్ చేశామని వివరించారు.
Delhi Building Collapse | యజమాని కోసం గాలింపు
ఘటన అనంంతరం భవన యజమాని హరిరామ్ బన్సల్ పరారు అయ్యారు. ఢిల్లీ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సోమవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. పీజీలు, నర్సింగ్ హోమ్‌లు, పాఠశాలలు, ఇతర సౌకర్యాలతో సహా ప్రజా కార్యకలాపాల కోసం ఉపయోగించే అన్ని భవనాలను తనిఖీ చేయడానికి చర్యలు చేపడుతామని ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి..: Vijay Women Comments | మహిళలను కించపరిస్తే చట్టం ఊరుకోదు.. సీఎం విజయ్ సంచలన హెచ్చరిక