Fee Reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లించాలి : టీఆర్​ఎస్​ చీఫ్​ కవిత

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fee Reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు. ఈ మేరకు హన్మకొండలో విద్యార్థులతో కలిసి ఆమె ర్యాలీలో పాల్గొన్నారు.

ఫీజు బకాయిల కోసం హన్మకొండ (Hanmakonda) అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి కవిత ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్​ గేట్​ వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అంతమందిని లోపలికి అనుమతించమని చెప్పారు. దీంతో కలెక్టరేట్ గేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ఆమె బైఠాయించారు. విద్యార్థులందరినీ కలెక్టరేట్ లోపలికి అనుమతించాలని కోరారు. ఆమె నిరసనతో పోలీసులు విద్యార్థులను, కవితను లోనికి అనుమతించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్​కు వినతి పత్రం అందించారు. ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Fee Reimbursement | పోరాటం కొనసాగుతుంది

కవిత మాట్లాడుతూ.. రీయింబర్స్‌మెంట్​ పెండింగ్‌లో ఉండటం వల్ల, డిగ్రీలు పూర్తి చేసుకున్న ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికెట్లు అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో చెలగాటం ఆడకుండా వెంటనే స్కాలర్​షిప్​, రీయింబర్స్​మెంట్​ నిధులు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Singareni Alias Issue | సింగరేణి మారుపేర్ల వివాదంపై భట్టి కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *