Gambling Raid | పేకాటలో దొరికిన కార్పొరేటర్​..

దీపావళి సందర్భంగా పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Gambling Raid | దీపావళి సందర్భంగా పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిజామాబాద్​ (Nizamabad) పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని ఆయా పోలీస్​స్టేషన్ల పరిధిలో నిరంతర నిఘా కొనసాగిస్తూ పలు పేకాట స్థావరాలపై దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Gambling Raid | 3వ టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మూడో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అర్సపల్లి బైపాస్​రోడ్​లో షేక్​ సలీం అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మంది షేక్​ సలీం ఇంట్లో పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు. ఇందులో ఓ డివిజన్​ కార్పొరేటర్​ సైతం ఉన్నాడు. అనంతరం వారివద్ద నుంచి రూ.లక్షకు పైగా నగదు, 8 మొబైళ్లు స్వాధీనం చేసుకుని పోలీస్​స్టేషన్​ తరలించారు. అనంతరం నిజామాబాద్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరపర్చనున్నట్లు మూడో టౌన్​ ఎస్సై హరిబాబు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Tree Falls on Auto | ఆటోపై కూలిన భారీ మర్రిచెట్టు.. ఐదుగురికి గాయాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *