Yogi Adityanath | దీపావళి కాలుష్యంపై యూపీ సీఎం కీలక వ్యాఖ్యలు

దీపావళి సందర్భంగా కాలుష్యం గురించి మాట్లాడే వారిపై యూపీ సీఎం యోగి విమర్శలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yogi Adityanath | దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడాన్ని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించుకున్నారు. పండుగ వేడుకల వల్ల కలిగే కాలుష్యం కాలక్రమేణా తొలగిపోతుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం వ్యవస్థనే కలుషితం చేసిన అవినీతి విషయంలో ఎందుకు ఇలాంటి ఆందోళన వ్యక్తం చేయరని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం పండుగ వేడుకలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని, పైగా ప్రజలు ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని ప్రోత్సహించామని ముఖ్యమంత్రి చెప్పారు. దీపావళితో కాలుష్యం కలుగుతుందని చాలామంది వాదిస్తుంటారు. ఒకవేళ కాలుష్యం కలిగినా, అది కాలక్రమేణా తొలగిపోతుంది అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రజలు ఏదైనా పండుగను జరుపుకుంటున్నప్పుడల్లా, కొందరు అకస్మాత్తుగా కాలుష్యం గురించి మాట్లాడటం మొదలుపెడతారని విమర్శించారు.

Yogi Adityanath | వాటి విషయంలో మౌనం

ఒక రోజు జరిగే వేడుకలపై విమర్శలు చేసేవారు వ్యవస్థాగత తప్పుల విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారని యోగి విమర్శించారు. అవినీతి పనులతో మొత్తం వ్యవస్థనే కలుషితం చేసిన వారిని ఎవరూ ఏమీ అడగరన్నారు. కానీ ప్రజలు ఒక్క రోజు బాణసంచా కాలిస్తే మాత్రం ‘కాలుష్యం’ అని గోల చేస్తారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం పండుగలపై ఎలాంటి ఆంక్షలు విధించదని, ధైర్యంగా బాణసంచా కాల్చి ఆనందించాలని ప్రజలకు సూచించారు.

ఇది కూడా చదవండి..: Kolkata Sairang Express | అస్సాం రైలు ప్రమాదం.. వైరల్ అవుతున్న లాస్ట్ మినిట్ విజువల్స్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *