Inspectors Transfers | భారీగా ఇన్​స్పెక్టర్ల బదిలీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inspectors Transfers | సైబరాబాద్​ కమిషనరేట్‌లో పరిధిలో భారీగా సివిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సైబరాబాద్​ సీపీ రమేశ్​ రెడ్డి (CP Ramesh Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 65 మందికి స్థాన చలనం కలిగించారు.

Inspectors Transfers | మల్టీజోన్​–2కు సరెండర్​

తెలంగాణ డీజీపీగా ఇటీవల సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకేసారి 65 మంది ఇన్​స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్ చేయడం గమనార్హం. చాలా కాలంగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేశారు. అంతేగాకుండా పని తీరు ఆధారంగా పలువురిని ఇతర చోట్లకు పంపించారు. పలు పోలీస్​ స్టేషన్​ల ఎస్​హెచ్​వోలను బదిలీ చేశారు. వీఆర్​లో ఉన్న పలువురు ఇన్​స్పెక్టర్లకు పోస్టింగ్ ఇచ్చారు. కమిషనరేట్​ పరిధిలోని 11 మంది ఇన్​స్పెక్టర్లను మల్టీజోన్​–2కు సరెండర్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పలువురు పోలీసులను త్వరలో బదిలీ చేయనున్నట్లు సమాచారం. పరిపాలన సౌలభ్యం కోసం భారీగా సిబ్బంది ట్రాన్స్​ఫర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

 

దీనిని కూడా చదవండి : Telangana PRC | పీఆర్సీపై త్వరలో నిర్ణయం : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *