అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Accident | హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకులను ఢీకొట్టాడు. దీనిపై అతడిని ప్రశ్నించడంతో కారుతో ఢీకొని ఆ వ్యక్తిని రెండు కిలోమీటర్లు లాక్కెళ్లాడు.
మీర్‌పేట్ (Meerpet)కు చెందిన ఎస్కే జిలానీ, ఫైసల్ తండ్రీకొడుకులు. వీరు శనివారం రాత్రి బైక్‌పై ఎల్‌బీనగర్ వైపు వెళ్తుండగా వెనుక నుంచి ఓ కారు ఢీకొంది. ఈ ఘటన గాయత్రినగర్ (Gayatrinagar) సమీపంలో చోటు చేసుకుంది. దీంతో ఫైసల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జిలానీ కారు డ్రైవర్‌తో వాగ్వాదం చేశాడు. ఈ క్రమంలో కారు డ్రైవర్ బాధితులపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే, అతను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని ఆపడానికి జిలానీ కారుకు అడ్డంగా నిలబడ్డాడు.
Hyderabad Accident | స్థానికులు ఆపడంతో పరార్
జిలానీ అడ్డుగా నిలబడ్డ సదరు కారు డ్రైవర్ ఆపకుండా అతడిని ఢీకొని కారును అలాగే వేగంగా తీసుకెళ్లాడు. దీంతో జిలానీ బోనెట్‌పై గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాడు. అయితే జిలానీ కారు కింద పడకుండా గట్టిగా పట్టుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. బాలానగర్ క్రాస్‌రోడ్స్ సమీపంలో ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు కారును ఆపారు. అయితే డ్రైవర్ పరార్ అయ్యాడు. జిలానీ కుమారుడు ఫైసల్ రెండు కాళ్లు విరిగాయి. కాగా కారుపై ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అని స్టిక్కర్ ఉండటం గమనార్హం.
SK Jilani and Faisal, a father-son duo were heading back home last evening. When they were near Gayatri Nagar, heading towards LB Nagar, a car rammed them from behind.
Faisal was badly injured.
This lead to an argument and the car driver tried to attack the victims. Soon, he… pic.twitter.com/XR0Pt6XJMU
— Revathi (@revathitweets) May 3, 2026
ఇది కూడా చదవండి : Delhi Fire Accident | ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలడంతో నలుగురు సజీవదహనం


[…] […]