CII Partnership Summit | ప్రారంభమైన సీఐఐ సదస్సు.. హాజరైన కేంద్ర మంత్రి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CII Partnership Summit | విశాఖపట్నంలో సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు గురువారం ఉదయం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. సదస్సు ప్రారంభానికి ముందు ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, వివిధ కళాకృతులు, ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు.

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit ) నిర్వహిస్తున్నారు. నవంబర్ 12,13 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులు,ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకానున్నారు. వాణిజ్యం, సాంకేతికత, విశ్వాసం, ఆలోచనా నాయకత్వంతో మారుతున్న ప్రపంచ గతిశీలతను అధిగమించడం అనే ఇతివృత్తంతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

CII Partnership Summit | 12 వేల ఉద్యోగాలు

ఈ సదస్సులో కియా ఇండియా, ఆంధ్రప్రదేశ్‌లోని తన అనంతపురం ప్లాంట్‌ను విస్తరించడానికి 2 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. దీని ద్వారా వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.5 లక్షల కార్లకు పెంచడంతో పాటు 12,000 కొత్త ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ సదస్సులో సుమారు రూ.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కోసం 160కి పైగా అవగాహన ఒప్పందాలు కుదురుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : CCTV Cameras | నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *