అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Viksit Bharat 2047 | భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యేలోగా దేశాన్ని అభివృద్ధి చెందిన జాబితాలో చేరుస్తామన్నారు. డెడ్‌లైన్ పెట్టుకున్నప్పుడు పనిలో వేగం పెరుగుతుందని చెప్పారు. అందుకే వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.
జర్నలిస్టుల కోసం బీజేపీ నిర్వహించిన దీపావళి మిలన్ కార్యక్రమంలో ప్రధాని గురువారం మాట్లాడారు. ఇలాంటి సమావేశాలలో తాను కుర్చీలు సర్దే రోజుల నుంచే మీడియాతో తన అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పత్రికా ప్రకటనల రోజుల నుండి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ యుగం వరకు మీడియా పరిణామాన్ని తాను చూశానని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 12 ఏళ్ల క్రితం నాలుగు వరుసల రహదారిని నిర్మించడం కూడా ఒక పెద్ద విజయంగా పరిగణించబడేదని పేర్కొన్నారు. కానీ నేడు దేశవ్యాప్తంగా అనేక రోడ్లను అభివృద్ధి చేశామన్నారు.
Viksit Bharat 2047 | అన్ని రంగాల్లో పురోగతి
అంతరిక్ష పరిశోధన, మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి రంగాలలో దేశం ఇటీవల పురోగతి సాధించిందని మోదీ అన్నారు. వాటిని చూస్తుంటే.. అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న 2047 లక్ష్యం సాధించదగినదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్పష్టమైన లక్ష్యం పాలన వేగాన్ని, విధానాన్ని మార్చడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ అనే కల స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉందన్నారు. అయితే ఇప్పుడు దానికి ఒక గడువు ఉందని చెప్పారు. 2047 గడువు పురోగతిని వాయిదా వేయడానికి కాకుండా, పని వేగాన్ని పెంచి, తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
Delhi: At the Deepawali Milan Samaroh at the BJP headquarters, Prime Minister Narendra Modi says, “Friends, remember that 12 years ago, even building a four-lane road was considered a major achievement…” https://t.co/HeI77f82OW
— IANS (@ians_india) November 12, 2026
ఇది కూడా చదవండి : ACB Raids | అక్రమాస్తులు కూడబెట్టిన ఇరిగేషన్ డీఈఈ.. ఏసీబీ సోదాలు