Kerala University Clash | ఎస్​ఎఫ్​ఐ, యూత్​ కాంగ్రెస్​ నాయకుల ఘర్షణ.. కేరళ యూనివర్సిటీలో ఉద్రిక్తత

తిరువనంతపురంలో ఓ యూనివర్సిటీలో ఉద్రిక్తత హాస్టల్ బయట యూత్ కాంగ్రెస్ ప్రదర్శన హింసాత్మకంగా మారింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kerala University Clash | తిరువనంతపురం (Thiruvananthapuram)లో ఓ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ బయట యూత్ కాంగ్రెస్ ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఎస్ఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు రాళ్లు, బీర్ సీసాలు, మండుతున్న కాగడాలతో దాడులు చేసుకున్నారు.

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నాయకులు బుధవారం రాత్రి నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే హాస్టల్​లో నుంచి వారి ర్యాలీపై రాళ్లు, బీర్ సీసాలు, పెట్రోల్ బాంబులు విసిరారని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. మరోవైపు నిరసనకారులు మండుతున్న కాగడాలను హాస్టల్​ ఆవరణలోకి విసిరారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. దీంతో హాస్టల్​ రణరంగాన్ని తలపించింది.

Kerala University Clash | నిరసనలకు పిలుపు

పోలీసులు హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో ఎస్ఎఫ్ఐ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. పోలీసులు విద్యార్థులపై దాడి చేశారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. రాష్ట్రవ్యాప్త తరగతుల బహిష్కరణ, సచివాలయం మరియు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టాలని ప్రకటించింది. మాజీ సీఎం పినరయి విజయన్ ఈ ఘటనను “ఏకపక్ష దాడి”గా అభివర్ణించారు. హాస్టల్‌లోని విద్యార్థులను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Modi Trump call | ట్రంప్‌తో ప్రధాని మోడీ ఫోన్‌ సంభాషణ.. వాణిజ్యం, రక్షణ, ఇంధనంపై చర్చలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *