Stock Market Crash | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ నష్టాల బాటలో సాగుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Crash | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ నష్టాల బాటలో సాగుతోంది. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ బ్యారెల్‌కు 96 డాలర్లు దాటడం కూడా ఆందోళన కలిగిస్తోంది.

Stock Market Crash | నష్టాలతో ప్రారంభం..

సెన్సెక్స్ ఉదయం 78 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 533 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని 579 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 90 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై మరో 132 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 169 పాయింట్లు ఎగబాకింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 529 పాయింట్ల నష్టంతో 81,381 వద్ద, నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో 25,093 వద్ద ఉన్నాయి.

Stock Market Crash | సూచీలను పడేసిన బ్యాంకింగ్ షేర్లు..

బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో, మెటల్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బ్యాంక్, ఫైనాన్షియల్, ఆటో ఇండెక్స్‌లు ఒక శాతానికిపై నష్టంతో ఉన్నాయి. దీని ప్రభావం ప్రధాన సూచీలపై కనిపిస్తోంది. పవర్, క్యాపిటల్ గూడ్స్, టెలికాం రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాల్లోనే ఉన్నాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 4 స్టాక్స్ లాభాలతో, 26 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఎయిర్‌టెల్ 0.77 శాతం, హెచ్యూఎల్ 0.74 శాతం, రిలయన్స్ 0.46 శాతం, టెక్ మహీంద్రా 0.15 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎం అండ్ ఎం 2.02 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.50 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.47 శాతం, బీఈఎల్ 1.42 శాతం, ఇండిగో 1.32 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Gift Nifty Market Signals | మిక్స్‌డ్ గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *