అక్షరటుడే, వెబ్‌డెస్క్: Punjab Gun Culture | పంజాబ్‌లో ఇటీవల నేరాలు పెరిగాయి. ముఖ్యంగా కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకున్నాయి. కొందరు వ్యక్తులు పోలీసులపై సైతం కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలో గవర్నర్ గులాబ్ చంద్ కటారీయా (Gulab Chand Kataria) కీలక వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్‌లో తూటాలను టపాకాయల్లా తేలికగా పేలుస్తున్నారని గవర్నర్ అన్నారు. లుధియానాలో జరిగిన సత్ పాల్ మిట్టల్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసగించారు. నేరాలు పెరుగుతుండటంతో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిని సంతృప్తికరంగా వర్ణించలేమని అన్నారు. గన్ కల్చర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న చిన్న వివాదాలు కూడా తుపాకుల వాడకానికి దారితీస్తున్నాయని, చిన్నపిల్లలు కూడా పిస్టళ్లను పట్టుకుని కాల్పులు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Punjab Gun Culture | డ్రగ్స్ ముప్పు
ధైర్యసాహసాలకు, దేశానికి చేసిన సేవలకు పేరుగాంచిన పంజాబ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల సమస్య బలహీనపరుస్తోందని కటారియా అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం సామాజిక ఉద్యమం అవసరమని పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వానికి లేదా ఏ ఒక్క సంస్థకు వదిలివేయలేమని ఆయన తెలిపారు. వ్యసనంతో పోరాడుతున్న యువతను ద్వేషించవద్దని సమాజానికి విజ్ఞప్తి చేస్తూ, వారు ఈ సమస్యను అధిగమించి సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి సహయ పడాలని సూచించారు. డ్రగ్స్‌పై పోరాటంతో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Yamuna River | యమున నదిలో చేపల మృతిపై వివాదం