అక్షరటుడే, వెబ్‌డెస్క్: Inspector Transfers | తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్–1 పరిధిలో ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 15 మందిని బదిలీ చేస్తూ ఐజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్ఫర్ అయిన వారిని వెంటనే రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు కొత్త స్థానాల్లో చేరనున్నారు.
Inspector Transfers | బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు వీరే..
వెయిటింగ్లో బియాని సంతోష్ రావును మహబూబాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. మెట్పల్లి సీఐగా ఉన్న బి.సురేష్ బాబును కరీంనగర్ సీఎస్బీ–2కు పంపించారు. కామారెడ్డి పీసీఆర్‌లో ఉన్న జగడం నరేశ్‌ను భిక్కనూరు సీఐగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ఎం.సంపత్ కుమార్‌ను ఐజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. రామగుండం టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న గంగాధర రమేశ్ బాబును రామగుండం సీఎస్బీ–3కు పంపించారు. నిజామాబాద్ సీసీఎస్‌లో ఉన్న పింగలి మహేందర్ రెడ్డిని సిద్దిపేట వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎస్.వాసుదేవ రావును ఐజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
రామగుండం సీసీఎస్‌లో ఉన్న సీహెచ్.విద్యాసాగర్‌ను సిద్దిపేట రూరల్ సీఐగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న మడుగుల శ్రీనును ఐజీగా కార్యాలయానికి పంపించారు. రామగుండం లీగల్ సెల్లో ఉన్న వై.కృష్ణకుమార్‌ను రామగుండం సర్కిల్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక సీఐడీలో పనిచేస్తున్న కోటగిరి శ్రీధర్‌ను రామగుండం లీగల్ సెల్‌కు బదిలీ చేశారు. కరీంనగర్ పీటీసీలో ఉన్న మంచినీల శ్రీనివాస్‌ను మహబూబాబాద్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు. ఇచ్చోడ సీఐగా ఉన్న బండారి రాజును వరంగల్ కమిషనరేట్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. ఆదిలాబాద్ పీసీఆర్‌లో పనిచేస్తున్న సీహెచ్.రమేశ్‌ను ఇచ్చోడ సీఐగా పంపించారు. జగిత్యాల వీఆర్‌లో ఉన్న కె.నరేశ్‌ను ఆదిలాబాద్ పీసీఆర్‌కు బదిలీ చేశారు.
ఇది కూడా చదవండి..: Inspectors Transfers | భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీ


[…] ఇది కూడా చదవండి: Inspector Transfers | మల్టీజోన్–1 పరిధిలో ఇన్స్ప… […]