JEE Advanced 2027 Exam Date | మే 23న జేఈఈ అడ్వాన్స్‌డ్ 2027 : ఐఐటీ ఢిల్లీ కీలక ప్రకటన!

అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై 10-12 అంకెల బేసిక్ (నాన్-సైంటిఫిక్) ఆన్-స్క్రీన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: JEE Advanced 2027 Exam Date | దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) లలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ ఇది.

జేఈఈ-అడ్వాన్స్‌డ్ (JEE-Advanced) 2027 పరీక్ష తేదీని నిర్వాహక సంస్థ ఐఐటీ ఢిల్లీ Delhi శుక్రవారం (నవంబర్ 13) అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 2027 మే 23వ తేదీన (ఆదివారం) దేశవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది.

JEE Advanced 2027 Exam Date | పరీక్షా విధానం & సమయ వేళలు

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ (CBT) విధానంలో జరుగుతుంది. అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై 10-12 అంకెల బేసిక్ (నాన్-సైంటిఫిక్) ఆన్-స్క్రీన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.

రెండు పేపర్లు తప్పనిసరి: ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు రెండింటికీ తప్పనిసరిగా హాజరు కావాలి.

  • పేపర్-1: ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
  • పేపర్-2: మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు.
  • సబ్జెక్టులు: రెండు పేపర్లలోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.

JEE Advanced 2027 Exam Date | టాప్ 2.5 లక్షల మందికి అవకాశం

జేఈఈ-మెయిన్ (JEE-Main) పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 2,50,000 మంది అభ్యర్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత పొందుతారు. ఒక విద్యార్థి వరుసగా రెండు సంవత్సరాలలో గరిష్ఠంగా రెండు సార్లు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరు కావడానికి వీలుంటుంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

 

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *