అక్షరటుడే, కామారెడ్డి: Bhikkanoor CI Appointment | రాష్ట్రంలోని మల్టీజోన్–1 పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీ జరిగాయి. ఇందులో భాగంగా భిక్కనూరు సీఐగా జగడం నరేష్ (Jagadam Naresh) నియమితులయ్యారు. ఈ మేరకు ఐజీ (Multi Zone–1) చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Bhikkanoor CI Appointment | కామారెడ్డిలో పనిచేసిన అనుభవం..
భిక్కనూరు సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సంపత్ కుమార్‌ను ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జగడం నరేష్ గతంలో కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల పని చేశారు. సదాశివనగర్ (Sadasivanagar) ఎస్సైగా, బిచ్కుంద సీఐగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం పోలీస్ కంట్రోల్ రూంలో పనిచేస్తున్నారు. అయితే భిక్కనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ బదిలీ అవుతున్నారని కొన్నిరోజులుగా ప్రచారం జరిగింది. ఆయన స్థానంలో సీసీఎస్‌లో(CCS) ఉన్న ఓ అధికారిని నియమిస్తారని, ఇక్కడి సీఐని సీసీఎస్‌కు తీసుకుంటారన్న ప్రచారం సాగింది. కొద్దిరోజుల క్రితం కామారెడ్డి (Kamareddy) రూరల్ సీఐగా జగడం నరేష్ రానున్నారని సైతం ప్రచారం జరిగింది. అయితే రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ రావడంతో ఆ ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతం అనూహ్యంగా భిక్కనూరు సీఐగా జగడం నరేష్ బదిలీపై వస్తున్నారు.
ఇది కూడా చదవండి: Inspector Transfers | మల్టీజోన్–1 పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీ

