Antimicrobial Resistance Awareness | యాంటీబయాటిక్స్ అతివాడకంతో ప్రాణాంతక ముప్పు.. సావ్లాన్ సరికొత్త క్యాంపెయిన్!

ఒకప్పుడు చిటికెలో నయం చేసిన మందు ఇప్పుడు జబ్బును తగ్గించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? సాధారణ జలుబు లేదా చిన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గడం కష్టమైపోయి, చివరకు ప్రాణాలకే ముప్పు వస్తే ఎలా? ఈ ప్రమాదకర సమస్యనే 'యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్' (ఏఎంఆర్) అంటారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Antimicrobial Resistance Awareness | ఒకప్పుడు చిటికెలో నయం చేసిన మందు ఇప్పుడు జబ్బును తగ్గించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? సాధారణ జలుబు లేదా చిన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గడం కష్టమైపోయి, చివరకు ప్రాణాలకే ముప్పు వస్తే ఎలా? ఈ ప్రమాదకర సమస్యనే ‘యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) అంటారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య ముప్పుల్లో ఇది కూడా ఒకటి. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఇన్ఫెక్షన్లు రాకుండా చేతులు ఎందుకు కడుక్కోవాలో వివరిస్తూ ఐటీసీకి చెందిన ‘సావ్లాన్ ( Savlon ) స్వస్థ్ ఇండియా మిషన్’ (SSIM) సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ ఏఎంఆర్ అవగాహన వారం (నవంబరు 18–24) సందర్భంగా ‘వీలవ్‌యాంటీబయాటిక్స్’ పేరుతో ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. మందులను మనం ఎలా వాడుతున్నాం అనే దానిపై పునరాలోచించుకోవాలని, చేతుల శుభ్రత ఎంత ముఖ్యమో తెలుసుకోవాలని ఈ ప్రచారం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.

Antimicrobial Resistance Awareness | నిపుణుల హెచ్చరిక..

యాంటీబయాటిక్స్ మన వైద్య రంగాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎన్నో ప్రాణాంతక రోగాలను నయం చేసి లక్షలాది ప్రాణాలను కాపాడాయి. కానీ వీటిని అవసరం లేకపోయినా, అతిగా వాడటం వల్ల పెద్ద ముప్పు ముంచుకొస్తోంది. బ్యాక్టీరియా పదేపదే ఈ మందులకు గురైనప్పుడు, వాటిని తట్టుకుని బతికే శక్తిని సంతరించుకుంటుంది. అప్పుడు ఆ మందులు ఆ రోగంపై అసలు పనిచేయవు. ఈ సమస్యను ఎదుర్కోవాలంటే రెండు ప్రధానమైన పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మొదటిది.. యాంటీబయాటిక్స్‌ను ఎప్పుడు పడితే అప్పుడు వాడకుండా జాగ్రత్తపడాలి. రెండోది.. చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. సబ్బుతో తరచుగా చేతులు కడుక్కునే ఈ చిన్న అలవాటు క్రిములు మన శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుంది. తద్వారా ఏఎంఆర్ వంటి పెద్ద ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

Antimicrobial Resistance Awareness | డాక్టర్ల సలహా..

ఈ అంశంపై అపోలో హాస్పిటల్స్ డాక్టర్ విజయ్ యేవాలే మాట్లాడుతూ.. “మనకు లేదా పిల్లలకు కొద్దిగా జ్వరం, దగ్గు రాగానే వెంటనే యాంటీబయాటిక్స్ వాడేయడం మనం చేసే పెద్ద తప్పు. ఇంట్లో మిగిలిపోయిన పాత మందులు వేసుకోవడం, డాక్టర్ చెప్పిన రోజులు పూర్తి కాకుండానే మధ్యలో ఆపేయడం చేస్తుంటాం. సాధారణ వైరల్ జలుబుకు యాంటీబయాటిక్స్ అసలు పనిచేయవు. జబ్బు వచ్చిన తర్వాత నయం చేసుకోవడం కంటే, అసలు రాకుండా జాగ్రత్త పడటమే మంచిది” అని వివరించారు. మరోవైపు, చేతుల పరిశుభ్రతపై ప్రజల్లో మార్పు తెచ్చేందుకు సావ్లాన్ మిషన్ ఎప్పట్నుంచో కృషి చేస్తోంది. 2016లో ప్రారంభమైన ఈ మిషన్.. ఇప్పటివరకు 68 వేలకు పైగా పాఠశాలలకు, 1.59 కోట్ల మంది పిల్లలకు అవగాహన చేరవేసింది. ఈ పోరాటం కేవలం డాక్టర్లకు, హాస్పిటల్స్‌కు మాత్రమే సంబంధించినది కాదని, ప్రతి ఒక్కరూ రోజువారీ పరిశుభ్రతను అలవాటు చేసుకోవడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని సావ్లాన్ పేర్కొంటోంది.

ఇది కూడా చదవండి:  Nimbachala Brahmotsavams | శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *