అక్షరటుడే, కోటగిరి: Pension Scheme | దేశంలోకెల్లా ఎక్కువ పింఛన్లు ఇస్తున్నది తెలంగాణలోనేనని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్లో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ ఛైర్మన్ కాసుల బాలరాజ్, స్థానిక నాయకులతో కలిసి, కొత్త పెన్షన్ మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు.
Pension Scheme | పోతంగల్ మండలానికి 447 పింఛన్లు..
నూతనంగా పోతంగల్ మండలానికి 447 పింఛన్లు మంజూరు అయ్యాయని పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) అన్నారు. 299 పింఛన్లు భర్తలు కోల్పోయిన వారికి వచ్చాయని, 67 పింఛన్లు వికలాంగులకు, 77మంది ఒంటరి మహిళలకు పింఛన్లు మంజూరయ్యాయని అన్నారు. గ్రామాలలో విచ్చలవిడిగా కల్తీ,బెల్ట్ షాపులు ఏర్పడి మద్యం విక్రయించడం ద్వారా వాటిని బానిసై పలువురు మృతిచెందారని పోచారం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు సన్నబియ్యం, ఉచిత బస్, కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, సంక్షేమ పథకాలు, స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిందని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సాయన్న, సర్పంచ్ కల్లూరి సంధ్య(హన్మాండ్లు), ఎంపీడీవో చందర్, తహశీల్దార్ సందీప్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు షాజీ పటేల్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, సీనియర్ నాయకులు ఏజాజ్ ఖాన్, గంగాధర్, కేశ వీరేశం, సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Indiramma Family Life Insurance | ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి