అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Indiramma Family Life Insurance | ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) కోరారు. ఈ పథకం అమలు కోసం దరఖాస్తుల స్వీకరణపై మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Indiramma Family Life Insurance | ప్రతి కుటుంబం వినియోగించుకునేలా..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గురించి విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తూ, అర్హత కలిగిన ప్రతి కుటుంబం వినియోగించుకునేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 19వ తేదీ నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు ముందస్తుగానే అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించబడుతుందని, కుటుంబంలో జీవనోపాధికి ప్రధానంగా ఆధారపడే వ్యక్తికి బీమా వర్తించేలా నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
Indiramma Family Life Insurance | 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్నవారు..
18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులైన వారు ఈ పథకం పరిధిలోకి వస్తారని, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలతో పాటు, రేషన్ కార్డు లేని కుటుంబాలు సైతం ఈ పథకానికి అర్హులేనని కలెక్టర్ తెలిపారు. బీమా ప్రయోజనం పొందే వ్యక్తి ఒకరిని లేదా ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. అలా అయినప్పుడు బీమా మొత్తాన్ని తమకు నచ్చిన విధంగా పంపిణీ చేసే వివరాలను సైతం నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో నామినీలతో హాజరు కావాలని, నామినీ మైనర్ అయిన పక్షంలో అపాయింటీ రావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, భుజంగరావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, సీపీవో రతన్, ఇన్ఛార్జి డీపీవో నాగరాజు,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kothapet Fire Accident | కొత్తపేట్లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు..