Khelo India Youth Games | 11వ తేదీ నుంచి ఖేలో ఇండియా పోటీలు : కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వచ్చేనెల 11వ తేదీ నుంచి ఖేలో ఇండియా పోటీలు జరుగనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Khelo India Youth Games | రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వచ్చే నెల 11వ తేదీ నుంచి ఖేలో ఇండియా పోటీలు జరుగనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) తెలిపారు. ఈ మేరకు ఖేలో ఇండియా నేషనల్ యూత్ గేమ్స్ – 2026 లోగో, మస్కట్ గోడ పత్రికలను కలెక్టరేట్​లో ఆవిష్కరించారు.

Khelo India Youth Games | హైదరాబాద్​తో పాటు నిజామాబాద్​లో​..

డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్​తో పాటు వరంగల్, నిజామాబాద్​, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ పట్టణాలలో జాతీయ యువజన క్రీడలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న జాతీయ క్రీడలకు జిల్లాలోని యువత, క్రీడాకారులకు అవగాహన కల్పించడానికి, విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. క్రీడలకు సంబందించిన లోగో, మస్కట్​లను జిల్లాలోని క్రీడా ప్రాంగణాలు, బస్సు స్టాండ్స్ వద్ద ప్రధాన కూడళ్ళలో కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో రామ్ రెడ్డి , డీటీసీపీవో అన్సార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీపీవో సంపత్ కుమార్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Public Prosecutor caught in ACB trap | న్యాయదేవత సాక్షిగా లంచాల దందా.. ఏసీబీ వలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *