అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Cold Wave | రాష్ట్రంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు.
తెలంగాణ (Telangana)లో గురువారం నుంచి చలి తీవ్రత ఎక్కువ అయింది. శుక్రవారం తెల్లవారుజామున రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పలు ప్రాంతాల్లో సింగిలి డిజిట్‌కు పడిపోయాయి. దీంతో ఉదయం 10 గంటల వరకు కూడా చలి పెడుతోంది. సాయంత్రం 5 అయిందంటే చాలు బయటకు వెళ్లాలేని పరిస్థితి. దీంతో జలుము, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
Telangana Cold Wave | ఉష్ణోగ్రతల వివరాలు
సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో శుక్రవారం తెల్లవారుజామున అత్యల్పంగా 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. కోహీర్‌లో 9.7, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 10.5, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 10.7, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఇది కూడా చదవండి..: Adibatla TCS Ayyappa row | ఆదిభట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప దీక్షా వస్త్రధారణ వివాదం.. గేటు ఎదుట భక్తుల నిరసనతో ఉద్రిక్తత!