అక్షరటుడే, వెబ్డెస్క్: Tanguturu Road Accident | రహదారి ప్రమాదాలు మరోసారి విషాదాన్ని నింపాయి. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదంలోకి నెట్టింది. టంగుటూరు సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
Tanguturu Road Accident | టంగుటూరు వద్ద ప్రమాదం..
తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో టంగుటూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న సైడ్వాల్ను బలంగా ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొత్తగా వివాహమైన జంట కూడా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతులను ఒంగోలు, బాపట్ల ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. ఎంతో ఆనందంగా సాగిన తిరుమల యాత్ర తిరుగు ప్రయాణంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..