Missing Woman Traced | ఐదేళ్ల క్రితం మహిళ అదృశ్యం.. ఏఐ సాయంతో గుర్తించిన పోలీసులు

ఐదేళ్ల క్రితం అదృశ్యమైన మహిళను ఏఐ సాయంతో పోలీసులు తాజాగా గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Missing Woman Traced | ఐదేళ్లుగా కనిపించకుండా పోయిన ఒక మహిళను గుర్తించడానికి, ఆమె చిన్ననాటి ఫోటోను ఉపయోగించి ఆమె ప్రస్తుత రూపాన్ని ఏఐ ద్వారా యూపీ పోలీసులు (UP Police) పున:సృష్టించారు. అనంతరం ఆమె ఆచూకీని కనుగొన్నారు.

పెళ్లి చేస్తానని చెప్పి తమ గ్రామంలోని ఒక మహిళ తన కుమార్తెను ఐదేళ్ల క్రితం తీసుకువెళ్లిందని కిస్మత్ దేవి తెలిపారు. అయితే ఆ తర్వాత తనకూతురు మంజూ ఖర్వార్​ ఆచూకీ లేకుండా పోయిందని జులై 14న ఆమె బభానీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Missing Woman Traced | రాజస్థాన్​లో..

మంజూ ఖర్వారుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, వివరాలు లేకపోవడంతో పోలీసులు ఆమె చిన్ననాటి ఫొటో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఏఐ సాయంతో ఆ ఫొటోలోని యువతి ప్రస్తుతం ఎలా ఉంటుందో చిత్రీకరించారు. అనంతరం ఆమె రాజస్థాన్​లో ఉన్నట్లు గుర్తించారు. మంజు ఖర్వార్ (30) రాజస్థాన్‌లోని చురు జిల్లాలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నట్లు గుర్తించామని సోన్‌భద్ర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ వర్మ తెలిపారు. అయితే ఆమె తల్లి ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారనే వివరాలు తెలియరాలేదు.

ఇది కూడా చదవండి..: Yogi Adityanath Mother | సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. తల్లి సావిత్రి దేవి కన్నుమూత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *