CBI Raid | జీఎస్​టీ సూపరింటెండెంట్​ ఇంట్లో నోట్ల కట్టలు స్వాధీనం

సీజీఎస్​టీ సూపరింటెండెంట్​ నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేసి, భారీగా అక్రమాస్తులు గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Raid | హర్యానాలోని పంచకుల వద్ద పనిచేస్తున్న సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (CGST) సూపరింటెండెంట్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఈ సమయంలో భారీగా నగదు, ఆభరణాలు స్వాధృనం చేసుకున్నారు.

ప్రైవేట్ సంస్థకు సంబంధించి GST వ్యవహారాల్లో అక్రమ ప్రయోజనాలు కల్పించేందుకు సూపరింటెండెంట్​ లంచం డిమాండ్​ చేశాడు. రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు ఆయనను ఈ నెల 19న పట్టుకున్నారు. అనంతరం తాజాగా ఆయన నివాసాల్లో సోదాలు జరిపారు. ఈ తనిఖీల సమయంలో నిందితుడి అక్రమాస్తులు చేసి అధికారులే విస్తుపోయారు.

CBI Raid | విదేశీ కరెన్సీ..

ఆయన నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) జరిపిన సోదాల్లో సుమారు రూ. 1.86 కోట్ల విలువైన నగదు, విదేశీ కరెన్సీ, బంగారం, వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 24.29 లక్షల భారతీయ కరెన్సీ, సుమారు రూ. 15.65 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, అలాగే సుమారు రూ. 1.46 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, బంగారు కడ్డీలు, వెండిని సీజ్​ చేశారు. ఆరు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలు, ఇతర పత్రాలను గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Army Soldier Death | ఆర్మీ జవాన్ అనుమానాస్పద మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.