అక్షరటుడే, వెబ్డెస్క్ : Vikarabad Accident | వికారాబాద్ (Vikarabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం బుగ్గరామేశ్వరం దగ్గర లారీ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Vikarabad Accident | తీవ్ర విషాదం
పెండ్లిమడుగు నుంచి కేరెళ్లికి వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోయారు. మృతులను చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత, నాగేష్ గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దీనిని కూడా చదవండి : CBI Raid | జీఎస్టీ సూపరింటెండెంట్ ఇంట్లో నోట్ల కట్టలు స్వాధీనం