Drought Relief | కరువు నివారణకు సాయం చేయలి.. పీఏసీ కీలక తీర్మానాలు

రాష్ట్రంలో కరువు నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల సాయం చేయాలని పీఏసీ కోరింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drought Relief | రాష్ట్రంలో కరువు నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల సాయం చేయాలని పీఏసీ కోరింది. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించింది.

తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మాణాలు చేశారు. ఎల్​నినో నేపథ్యంలో ఏర్పడిన కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, రాష్ట్రానికి సాయం చేయాలని డిమాండ్​ చేశారు. 2027 జనగణనలో ఓబీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్ చేర్చాలని పేర్కొంది. ఈ మేరకు పీఏసీ నిర్ణయాలను మంత్రి పొన్నం ప్రభాకర్​ వెల్లడించారు.

Drought Relief | పార్టీ బలోపేతంపై..

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు పార్టీ-ప్రభుత్వ సమన్వయంపై నాయకులు చర్చించారు. మండల, గ్రామ, పట్టణ, వార్డు కాంగ్రెస్ కమిటీలను మరింత బలోపేతం చేయాలని పీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అనుబంధ సంఘాలను పటిష్టం చేయాలన్నారు. బీజేపీ జాతీయ నాయకుల పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకోవడానికి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని నాయకులకు సూచించారు.

దీనిని కూడా చదవండి : Electric Scooter Fire | ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *