Khammam Road Accident | కారును ఢీకొన్న లారీ.. దంపతుల మృతి

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Khammam Road Accident | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద ఓ కారును ​లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు.

హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన కిషోర్ రెడ్డి-లావణ్య కుటుంబంతో కలిసి అన్నవరం వెళ్లారు. కార్తీక మాసం నేపథ్యంలో అక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారు. అనంతరం తిరుగు పయనం అయ్యారు. వీరి కారు గ్రీన్​ఫీల్డ్​ హైవే మీదుగా వస్తుండగా.. ఖమ్మం జిల్లా వైరా మండలంలో ప్రమాదం చోటు చేసుకుంది. వారి కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కిషోర్ రెడ్డి, లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమారుడు ప్రణీత్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Khammam Road Accident | రెండు లారీలు దగ్ధం

విశాఖపట్నంలోఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సబ్బవరం మండలం బాటజంగాలపాలెం టోల్‌గేట్ వద్ద టైర్ల లోడుతో ఆగి ఉన్న లారీని టిప్పర్ ఢీకొంది. దీంతో మంటలు చెలరేగాయి. అనంతరం అవి రెండు వాహనాలకు వ్యాపించాయి. టిప్పర్​, లారీ పూర్తిగా కాలిబూడిద అయ్యాయి. టిప్పర్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

ఇది కూడా చదవండి..: Telangana K12 Education Reform | ఆరు దశల్లో స్కూల్ – ఇంటర్ విలీన ప్రక్రియ.. 2030 నాటికి ‘కే-12’ విధానం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *