Poultry Industry | పౌల్ట్రీ రంగానికి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

పౌల్ట్రీ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Poultry Industry | పౌల్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. ప్యూచర్‌ సిటీలో పౌల్ట్రీ కన్వెన్షన్‌ సెంటర్‌కు భూమి ఇస్తామన్నారు.

హైదరాబాద్‌ నగరంలోని హైటెక్స్‌లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌ పోలో సీఎం రేవంత్​ రెడ్డి ప్రసంగించారు. పౌల్ట్రీ ఇండస్ట్రీ కేవలం కోళ్లను, గుడ్లను ఉత్పత్తి చేయడమే కాదు.. రైతుల ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తుందన్నారు. నగరంలో పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో 2026 ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. 5 కోట్ల 30 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి విద్యార్థులు, యువతకు పౌష్టిక ఆహారాన్ని అందించడంలో పాల్ట్రీ వ్యాపారులు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు.

Poultry Industry | ఆహార ధాన్యాల కొరత లేదు

ఈ ఎక్స్​పో వ్యాపారులు పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ఎదురవుతున్న సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని సీఎం తెలిపారు. సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. కరువు పరిస్థితులు ఉన్నా.. రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేదన్నారు. రెండేళ్లకు సరిపడా సన్నంబియ్యం నిల్వలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు. కానీ పౌల్ట్రీకి సంబంధించి మొక్కజొన్నల కొరత ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు.

Poultry Industry | 3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

ఒడిదుడుకులను తట్టుకుని పరిశ్రమలో నిలబడటం, పరిశ్రమను కాపాడటాన్ని ప్రభుత్వం అభినందిస్తోందన్నారు. పౌల్ట్రీని కూడా ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా పాలసీలను రూపొందిస్తామని సీఎం చెప్పారు. పాలసీలు, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో చింత అవసరం లేదన్నారు. గత ప్రభుత్వాలు రూపొందించిన మంచి పాలసీలను కొనసాగిస్తూనే, కొత్త పాలసీలను తీసుకొస్తున్నామని వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణకు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Land Auction | అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరు : కేటీఆర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *