అక్షరటుడే, వెబ్‌డెస్క్: Land Auction | కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరన్నారు.
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్, మియాపూర్ భూములను ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించించింది. ఈ నెల 27న హెచ్ఎండీఏ వేలం నిర్వహించనుంది. దీనిని రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఉదయం హెచ్ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్‌ను కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Land Auction | భూములు అమ్మొద్దు
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములు వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇష్టానుసారంగా అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడం సరికాదన్నారు. ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాలతో కలిసి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వేలం రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Samvidhan Raksha March | ‘సంవిధాన్ రక్షా మార్చ్’ను విజయవంతం చేయాలి : మంత్రి పొన్నం