Trump Tariffs | మరోసారి సుంకాల మోతకు ట్రంప్​ సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి పలు దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి పలు దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. భారత్, చైనాతో పాటు 17 దేశాలపై ఈ వారంలోనే సుంకాలు పెంచవచ్చని తెలుస్తోంది.

ట్రంప్​ గతంలో పలు దేశాలపై సుంకాలు పెంచారు. అనంతరం వాటిని కోర్టు రద్దు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు ఇటీవల సిద్ధం అయ్యారు. అనంతరం ట్రంప్​ రష్యా (Russia) నుంచి డీజిల్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో సుంకాల విధింపు వాయిదా పడింది. ఇటీవల మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్​కు అమెరికా ఓటర్లు షాక్​ ఇచ్చారు. డెమోక్రాట్లను గెలిపించారు. అయినా కూడా మరోసారి ట్రంప్​ సుంకాలు విధించేందుకు సిద్ధం కావడం గమనార్హం.

Trump Tariffs | అమెరికా ఉత్పత్తిదారుల కోసం..

చైనా, భారత్​, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ సహా అనేక ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సహా దేశాలను లక్ష్యంగా చేసుకొని సుంకాలు విధించనున్నట్లు సమాచారం. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద, భారతదేశం, చైనా, యూరోపియన్ యూనియన్ మరియు మరో 13 దేశాల పారిశ్రామిక రాయితీలపై మార్చి 11న దర్యాప్తు ప్రారంభించబడింది. ఈ సెక్షన్ ప్రకారం, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను గుర్తించిన తర్వాత అధ్యక్షుడు సుంకాలు విధించవచ్చు. అమెరికా గతంలో ఇచ్చిన సబ్సిడీలు, మద్దతుతోఆర్థిక వ్యవస్థలలో అదనపు పారిశ్రామిక సామర్థ్యాన్ని సృష్టించాయని, ఇది అక్కడి సంస్థలు ప్రపంచ మార్కెట్లను చౌక వస్తువులతో ముంచెత్తడానికి వీలు కల్పించిందని ట్రంప్​ భావిస్తున్నారు. ఇది అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీసిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: UAE Bus Accident | యూఏఈలో మరో ఘోర రోడ్డు ప్రమాదం : రాస్ అల్ ఖైమాలో ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 13 మంది దుర్మరణం.. మృతుల్లో భారతీయులు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *