అక్షరటుడే వెబ్‌డెస్క్: ISB Internship Placements | ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఫర్ యంగ్ లీడర్స్ (PGP YL) రెండో బ్యాచ్ (2026–2028) సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్లేస్మెంట్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 130 మంది విద్యార్థులున్న ఈ బ్యాచ్‌లో సగటు పని అనుభవం కేవలం 9 నెలలు మాత్రమే. సాధారణ ఎంబీఏ కోర్సులతో పోలిస్తే ఇది తక్కువ అయినప్పటికీ, 45 కంపెనీల నుంచి 200కు పైగా ఇంటర్న్‌షిప్ ఆఫర్లు వచ్చాయి. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కు సగటు స్టైపెండ్ రూ.3.44 లక్షలుగా ఉండగా, గరిష్టంగా రూ.7.9 లక్షల స్టైపెండ్ నమోదైంది.
ISB Internship Placements | బ్యాంకింగ్‌లో భారీ ఆఫర్లు..
కన్సల్టింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగాల నుంచి కలిపి మొత్తం 117 ఆఫర్లు లభించాయి. వీటిలో యాక్సెంచర్ సొల్యూషన్స్ 29 ఆఫర్లతో అగ్రస్థానంలో నిలవగా, ఈవై-పార్తెనాన్ 17, డెలాయిట్ కన్సల్టింగ్ 9, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, మాస్టర్‌కార్డ్ చెరో 8 ఆఫర్లు ఇచ్చాయి. బెయిన్ & కంపెనీ, అల్వారెజ్ & మార్సల్, పీడబ్ల్యూసీ ఏసీ ఇండియా ఒక్కొక్కటి 7 ఆఫర్లు అందించాయి. వీటితో పాటు మెకిన్సీ & కంపెనీ, ఈవై జీడీఎస్, గోల్డ్‌మన్ సాక్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నోమురా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీడబ్ల్యూసీ ఇండియా, బార్క్లేస్, సిటీ, జెఫరీస్, సినర్జీ కన్సల్టింగ్ సంస్థలు కూడా నియామకాలు చేపట్టాయి.
ISB Internship Placements | ఎఫ్ఎంసీజీ రంగాల్లో నియామకాలు..
టెక్నాలజీ: ఈ విభాగంలో 27 ఆఫర్లు రాగా, పర్పుల్ 6 ఆఫర్లతో ముందుంది. గూగుల్, స్విగ్గీ, శాంసంగ్, ఫిలిప్స్ చెరో 5 ఆఫర్లు ఇచ్చాయి. అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియా కూడా విద్యార్థులను ఎంపిక చేసింది.
ఎఫ్ఎంసీజీ (FMCG): ఈ రంగంలో 17 ఆఫర్లు అందాయి. హిందుస్థాన్ యూనిలివర్, డాబర్ చెరో 6 ఆఫర్లతో అగ్రస్థానంలో నిలవగా, హేలియన్, ఐటీసీ, లొరియల్, క్యాస్ట్రాల్ సంస్థలు కూడా నియామకాలు జరిపాయి.
ISB Internship Placements | ఇతర రంగాల్లో అవకాశాలు..
బహుళ వ్యాపార రంగాల్లో పనిచేసే సంస్థల నుంచి 16 ఆఫర్లు లభించాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 6 ఆఫర్లతో ముందుండగా, టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ 4 ఆఫర్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. ఆదిత్య బిర్లా గ్రూప్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ కూడా విద్యార్థులను తీసుకున్నాయి.
ఇతర రంగాలలో యాక్సిస్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, ఆప్టిమస్ క్యాపిటల్, కమ్మిన్స్ ఇండియా ( India ), సినర్జీ కన్సల్టింగ్ చెరో 3 ఆఫర్లు అందించాయి. బాండ్బ్లాక్స్, లైట్‌హౌస్ కాంటన్, సింక్రోనీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్, జియోస్టార్, హీరో మోటోకార్ప్ సంస్థలు సైతం నియామకాలు చేపట్టాయి.
యువ ప్రతిభపై సంస్థల నమ్మకం: ఐఎస్బీ డీన్
కెరీర్ ప్రారంభ దశలో ఉన్న యువ ప్రతిభావంతులు సంస్థలకు అందించగల విలువను ఈ ఫలితాలు చాటుతున్నాయని ఐఎస్బీ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ప్రణవ్ జిందాల్ తెలిపారు. విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలతో విద్యార్థులు వాస్తవ వ్యాపార సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతున్నామని, అవకాశాలు కల్పిస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు, కెరీర్ ఆరంభ దశ నిపుణుల కోసం 20 నెలల పీజీపీ వైఎల్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు.
ఇది కూడా చదవండి: Chakratheertham Festival | భక్తిశ్రద్ధలతో చక్రతీర్థం.. లింబాద్రిగుట్టపై ఆధ్యాత్మిక శోభ