అక్షరటుడే, వెబ్‌డెస్క్: Plane Collision | అమెరికా (America)లోని వాషింగ్టన్ రీగన్ ఎయిర్‌పోర్టులో రన్‌వే 19 వద్ద రెండు విమానాలు ఢీకొన్నాయి. ట్యాక్సీయింగ్ సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737-800 విమానాల రెక్కలు ఒకదానికి ఒకటి తగిలాయి. ఓ విమానం రెక్క చివరిభాగం విరిగిపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
వాషింగ్టన్ ఎయిర్ పోర్టులో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ కోసం టాక్సీయింగ్ చేస్తుండగా విమానాలు ఒకదాని రెక్కలను మరొకటి తాకాయి. దీంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, ఒక జెట్ విమానం వింగ్‌లెట్‌కు నష్టం జరిగింది. డల్లాస్‌కు వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 638, చికాగోకు వెళ్తున్న ఫ్లైట్ 2152 విమానాలు ఢీకొన్నాయి.
Plane Collision | ప్రయాణాల రద్దు
ఈ ఘటనతో విమానాశ్రయం వైపు వస్తున్న మరో విమానాన్ని ల్యాండింగ్‌ను రద్దు చేసుకుని, తిరిగి వెనక్కి రావాలని కంట్రోల్ టవర్ కోరింది. చివరకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు తిరిగి గేటు వద్దకు చేరుకోగలిగాయి. ఆ రెండు విమానాలను సేవ నుండి తొలగించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. కలిగిన అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు చెబుతూ, వారిని వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చడానికి కృషి చేస్తున్నామని పేర్కొంది.
ఇది కూడా చదవండి..: BSF Constable Venu | పశువుల అక్రమ రవాణాను అడ్డుకునే యత్నంలో.. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి