One Nation One Election | 2029 మెగా ఎలక్షన్లకు కేంద్రం వ్యూహాత్మక స్కెచ్.. ‘డీలిమిటేషన్’ పునాదిపై ‘జమిలి ఎన్నికల’ సౌధం! దేశ రాజకీయాల్లో అతిపెద్ద మార్పునకు రంగం సిద్ధం!

ఈ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాలను 543 నుంచి 816కి (50% పెంపు), అలాగే రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచనున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సరిహద్దులు పూర్తిగా మారిపోతాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: One Nation One Election | భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ఒకవైపు నవంబర్ 30 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సవరించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ఆమోదించుకుంటూనే, మరోవైపు 2029 సాధారణ ఎన్నికల నాటికి ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ (జమిలి ఎన్నికలు) విధానాన్ని పట్టాలెక్కించేందుకు కేంద్రం తన వ్యూహాన్ని వేగవంతం చేసింది.

One Nation One Election | డీలిమిటేషన్ బిల్లు వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేవలం మహిళా రిజర్వేషన్ల అమలు కోసమే కాకుండా, 2029లో జరగబోయే జమిలి ఎన్నికలకు ఒక కీలకమైన పునాదిగా కేంద్రం ఉపయోగించుకుంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాలను 543 నుంచి 816కి (50% పెంపు), అలాగే రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచనున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సరిహద్దులు పూర్తిగా మారిపోతాయి.

డీలిమిటేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర లభించిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం తన పూర్తి ఫోకస్‌ను ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ బిల్లుపై పెట్టనుంది. దేశవ్యాప్తంగా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, ఓటర్ల జాబితాల సవరణ ఒకేసారి జరిగితే.. 2029లో లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాంకేతికంగా, పరిపాలనాపరంగా సులభతరం అవుతుందనేది కేంద్రం ఆలోచన.

One Nation One Election | డీలిమిటేషన్ కమిషన్ ముందున్న అసలైన ‘టైమ్ బాంబ్’ సవాల్!

బిల్లు ఆమోదం పొందిన వెంటనే కేంద్రం ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్​ను ఏర్పాటు చేయనుంది.

సుప్రీంకోర్టు రిటైర్డ్ (లేదా సిట్టింగ్) న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిషన్‌లో ఎన్నికల కమిషనర్లతో పాటు, ఆయా రాష్ట్రాలకు చెందిన 5 గురు ఎంపీలు, 5 గురు ఎమ్మెల్యేలు అసోసియేట్ సభ్యులుగా ఉంటారు.

కాగా, గతంలో 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ తన ప్రక్రియను పూర్తి చేయడానికి ఏకంగా ఆరేళ్లు (2008 వరకు) తీసుకుంది. కానీ ఇప్పుడు 2029 ఎన్నికలకు సమయం కేవలం రెండేళ్లు మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా 816 లోక్‌సభ, వేలాది అసెంబ్లీ స్థానాల సరిహద్దులను వివాదాలకు తావులేకుండా కమిషన్ ఖరారు చేయగలదా? అనేది ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

One Nation One Election | 2029 నాటికి ఒకే దెబ్బకు మూడు పిట్టలు!

రాజకీయ వ్యూహకర్తల అంచనా ప్రకారం, 2029 ఎన్నికల నాటికి కేంద్రం ఒకే దెబ్బకు మూడు భారీ రాజకీయ లక్ష్యాలను చేరుకోవాలని చూస్తోంది.

33% మహిళా రిజర్వేషన్ల అమలు: 2011 జనాభా లెక్కల ఆధారంగానే సీట్లను 50% పెంచడం ద్వారా, కొత్త జనాభా లెక్కల కోసం వేచి చూడకుండానే 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి మహిళా ఓటు బ్యాంకును ఆకట్టుకోవడం.

దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు చెక్: ఏప్రిల్ 2026లో ఈ బిల్లు వీగిపోవడానికి దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకతే కారణం. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% సీట్లు పెంచడం ద్వారా (ఉదాహరణకు తెలంగాణలో 17 నుంచి 26, ఏపీలో 25 నుంచి 38 సీట్లు) దక్షిణాది ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడం.

వన్ నేషన్ – వన్ ఎలక్షన్: కొత్త నియోజకవర్గాల మ్యాప్ సిద్ధమయ్యాక, జమిలి ఎన్నికల విధానాన్ని అమల్లోకి తెచ్చి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేయడం.

అయితే, డీలిమిటేషన్ కమిషన్ నియామకం, నియోజకవర్గాల విభజనలో అధికార పార్టీకి అనుకూలంగా మార్పులు జరుగుతాయంటూ విపక్షాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుపై జరిగే చర్చ, ఆ తర్వాత జమిలి ఎన్నికలపై కేంద్రం వేసే అడుగులు దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Mahatma Jyotirao Phule Death Anniversary | విద్యా విప్లవానికి పునాదులు వేసిన దార్షానికుడు మహాత్మా జ్యోతిరావు పులే

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *