Ponnam Prabhakar | మోదీ ముందు మోకరిల్లుతున్న బీఆర్ఎస్​ : మంత్రి పొన్నం

బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై మంత్రి పొన్నం ప్రభాకర్​ విమర్శలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ponnam Prabhakar | బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై మంత్రి పొన్నం ప్రభాకర్​ విమర్శలు చేశారు. ఉరికి ఉరికి ఊడిగం చేయడం ఎందుకు అని, మోదీ ముందు బీఆర్ఎస్ ఎందుకు మోకరిల్లుతోంది ప్రశ్నించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తారా అని పొన్నం అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ తెరవెనుక ఒక్కటే.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతే అందుకు నిదర్శనమని చెప్పారు. కిషన్ రెడ్డి మద్దతు అవసరం లేదన్నా కేటీఆర్ ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన, రిజర్వేషన్ల డిమాండ్లను పక్కదారి పట్టించేందుకే డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు.

Ponnam Prabhakar | తెరవెనుక ఒకటే..

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెరవెనుక ఒక్కటేనని మరోసారి స్పష్టమవుతోందని మంత్రి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శిస్తున్న కేటీఆర్, అదే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు ఎందుకు మద్దతు ఇస్తున్నారని నిలదీశారు. కేసుల భయంతోనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ అనే ధృతరాష్ట్ర కౌగిలిలో బీఆర్ఎస్ బందీ కావద్దొని, ఆ పార్టీతో రాజకీయంగా కలిసి ప్రయాణం చేస్తే చివరకు బీఆర్ఎస్ తన ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : Stalin Delimitation Stand | డీలిమిటేషన్​పై మా నిర్ణయం మారదు.. స్పష్టం చేసిన స్టాలిన్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *