అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi Delimitation | డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. 850 సీట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. 850 సీట్లు అయితే ఇండియా నాశనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. స్టాలిన్‌కు చెప్పాల్సిందంతా చెప్పామన్నారు. ఈ బిల్లు వల్ల తమిళనాడు ప్రజలకు కూడా నష్టం జరుగుతుందన్నారు. లోక్‌సభ సీట్లను 850 కి పెంచడంతో దేశ ఎన్నికల పటాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అధికారం బీజేపీకి లభిస్తుందని ఆరోపించారు. తమిళ సంస్కృతికి గట్టి రక్షకుడైన స్టాలిన్‌ను, తమిళనాడును కాపాడాలని, బీజేపీ దుష్ట పథకం అమలు కాకుండా చూడాలని తాము కోరామన్నారు.
Rahul Gandhi Delimitation | ఓటు వేయకముందే ఫలితం
ఇది కేవలం కొన్ని సీట్ల విషయం కాదని, ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని పునర్విభజిస్తారని చెప్పారు. బీజేపీకి ఓట్లను దొంగిలించడంలో సహాయం చేస్తూ పట్టుబడిన జ్ఞానేష్ కుమార్ డీలిమిటేషన్ కమిషన్‌లో సభ్యుడన్నారు. మొదట వారు ఓట్లను దొంగిలించారు. ఇప్పుడు వారు పటాన్ని దొంగిలించాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ బిల్లులో వారు విజయం సాధిస్తే, ఒక్క ఓటు కూడా వేయకముందే ఎన్నికల ఫలితం తేలిపోతుందని ఆరోపించారు. ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే స్టాలిన్ మాత్రం డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు.
దీనిని కూడా చదవండి : Delimitation Bill | ‘డీలిమిటేషన్’ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.. కేటీఆర్ ప్రశ్న