Ayyappa Swamy Maha Padipuja | అయ్యప్ప స్వాముల భిక్ష, మహాపడిపూజ.. డిసెంబర్ 3న సుభాష్ నగర్‌లో వేడుకకు ఏర్పాట్లు!

సుభాష్ నగర్‌లో డిసెంబర్ 3, 2026 గురువారం అయ్యప్ప స్వాముల భిక్ష, మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ayyappa Swamy Maha Padipuja | కార్తీక, మండల దీక్షల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో అయ్యప్ప నామస్మరణ మారుమోగుతోంది. నగరంలోని సుభాష్ నగర్‌లో డిసెంబర్ 3, 2026 గురువారం అయ్యప్ప స్వాముల భిక్ష, మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రముఖ పండితులు శ్రీ రాజన్ పంతుల ఆధ్వర్యంలో, అడ్వకేట్ జొన్న వెంకట రాజేంద్ర బాబు స్వామి, కిషన్ గౌడ్ గురుస్వామి, సుహాస్ గురుస్వామిల పర్యవేక్షణలో ఈ ఆధ్యాత్మిక మహోత్సవం జరగనుంది.

Ayyappa Swamy Maha Padipuja | కార్యక్రమ వివరాలు ఇవే..

  • వేదిక: సుభాష్ నగర్ (మీరాస్ హోటల్ ఎదురుగా ఉన్న కార్యాలయం వద్ద), నిజామాబాద్.
  • మధ్యాహ్నం 12:00 గంటలకు: మాలధారులైన అయ్యప్ప స్వాములకు మరియు భక్తులందరికీ మహా భిక్ష (అన్నదాన కార్యక్రమం).
  • సాయంత్రం 6:15 గంటలకు: అత్యంత వైభవంగా మహాపడిపూజ, భజనలు మరియు హారతి కార్యక్రమాలు.

ఈ పవిత్ర పూజా కార్యక్రమానికి అయ్యప్ప మాలధారులతో పాటు నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని, అనంతరం తీర్థప్రసాదాలు, అల్పాహారం స్వీకరించాలని నిర్వాహకులు జొన్న వెంకట రాజేంద్ర బాబు స్వామి, గురుస్వాములు కిషన్ గౌడ్, సుహాస్‌లతో పాటు కమిటీ సభ్యులు రవి కుమార్, విజయ్ కుమార్, అరుణ్ స్వామి, రామా గౌడ్, సుచిత్, కృష్ణ కోరారు.

One Nation One Election | 2029 మెగా ఎలక్షన్లకు కేంద్రం వ్యూహాత్మక స్కెచ్.. ‘డీలిమిటేషన్’ పునాదిపై ‘జమిలి ఎన్నికల’ సౌధం! దేశ రాజకీయాల్లో అతిపెద్ద మార్పునకు రంగం సిద్ధం!

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *