APNRTS Rescue Oman| ఒమన్‌లో బాధితురాలికి బాబు భరోసా.. మే 7న స్వగ్రామానికి రానున్న షహ్నాజ్ !

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:APNRTS Rescue Oman|ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్ గతేడాది నవంబర్‌లో ఉద్యోగం కోసం ఒమన్‌ రాజధాని మస్కట్‌కు వెళ్లారు. అయితే, అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఏజెంట్లు ఆమె ఫోన్‌ను లాక్కొని, వెనక్కి వెళ్లాలంటే రూ. 2 లక్షలు చెల్లించాలని వేధించడం మొదలుపెట్టారు.

APNRTS Rescue Oman|ప్రభుత్వ స్పందన..

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఏపీఎన్‌ఆర్టీ (APNRTS) సొసైటీ తక్షణమే రంగంలోకి దిగింది. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపడమే కాకుండా, ఏపీ పోలీసులు కూడా స్థానిక ఏజెంట్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ప్రభుత్వ ఒత్తిడితో దిగివచ్చిన ఏజెంట్లు, షహ్నాజ్‌ను తిరిగి పంపేందుకు అంగీకరించారు. మే 7వ తేదీన ఆమె ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోనున్నారు.

APNRTS Rescue Oman|ముఖ్యమంత్రి అభినందనలు..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వలస కార్మికుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాధితురాలిని వేగంగా రక్షించిన ఏపీఎన్‌ఆర్టీ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఇది కూడా చదవండి: West Bengal Election Results | బెంగాల్​లో మెజారిటీ మార్కును దాటిన బీజేపీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *