Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్‌తో భారీ లాభాల దిశగా సాగిన దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) .. తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో వెనక్కి తగ్గింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో ప్రారంభమై 28 పాయింట్లు తగ్గింది.

అక్కడినుంచి తిరిగి పుంజకుని 681 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో ప్రారంభమై 2 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 229 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 757 పాయింట్ల లాభంతో 77,671 వద్ద, నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో 24,233 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | ఐటీ, మీడియా రంగాలు మినహా..

దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐటీ, మీడియా రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్ లు లాభాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ (Nifty) రియాలిటీ ఇండెక్స్ 2.99 శాతం, ఆటో 1.56 శాతం, ఎఫ్ ఎంసీజీ 1.40 శాతం, యుటిలిటీ 1.37 శాతం, మెటల్ 1.37 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.28 శాతం, ఫార్మా 1.13 శాతం లాభాలతో ఉన్నాయి. ఐటీ 0.47 శాతం, మీడియా ఇండెక్స్ 0.37 శాతం నష్టాలతో సాగుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 స్టాక్స్ లాభాలతో, 6 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అదానీపోర్ట్స్ 5.04 శాతం, హెచ్యూఎల్ 4.42 శాతం, మారుతి 2.74 శాతం, ఎల్‌టీ 2.60 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.45 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : కొటక్ బ్యాంక్ 2.34 శాతం, ఎయిర్ టెల్ 1.37 శాతం, టీసీఎస్ 1.27 శాతం, టెక్ మహీంద్రా 0.74 శాతం, ఐటీసీ 0.41 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: May 04 Gold Rates | బంగారం ధర తగ్గుముఖం.. దేశంలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *